హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నంద్యాలలో పోలీసుల కార్డాన్‌ సెర్చ్!

NDL: నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆదివారం పోలీసులు కార్డాన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ ఆదేశాల మేరకు శ్రీశైలం, పాములపాడు, సున్నిపెంట, నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆయా గ్రామాలలో ఉన్న రౌడీషీటర్ల ఇండ్లలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రౌడీషీటర్లు గొడవలకు దూరంగా ఉండి ప్రశాంత వాతావరణంలో జీవించాలని పోలీసులు పేర్కొన్నారు.