హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నందిగామ రోడ్ల దుస్థితి పై ప్రజల ఆగ్రహం

NTR: నందిగామ పట్టణంలో రోడ్ల దుస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నందిగామ నుండి గుడిమెట్ల ప్రధాన రహదారి భారీ గుంతలతో నిండి, వాహనదారులకు ప్రాణభయం కలిగిస్తోంది. వర్షాలు పడినప్పుడు నీరు నిలిచి ప్రమాదకరంగా మారుతోంది. ఆర్ అండ్ బీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా స్పందన లేదని ప్రజలు మండిపడుతున్నారు. తక్షణమే రోడ్డు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.