ప్రకాశం: పామూరు(M) కంబాలదిన్నె గ్రామంలో పోలేరమ్మ గుడి నిర్మాణానికి నిర్వహించిన భూమిపూజ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే డా. ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామదేవత పోలేరమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం భక్తుల ఆకాంక్ష మేరకు చేపట్టడం సంతోషకరమన్నారు. ఆలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
పోలేరమ్మ గుడి నిర్మాణానికి శంకుస్థాపన


