హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అప్పరాచెరువులో కనకదాసు విగ్రహ ఆవిష్కరణ

సత్యసాయి: బత్తలపల్లి మండలం అప్పరాచెరువులో శ్రీశ్రీశ్రీ కనకదాసు విగ్రహ ప్రతిష్ట మహోత్సవం నిర్వహించారు. కురుబ సంఘం నాయకుల ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కనకదాసు సమాజంలో సమానత్వం, భక్తి, మానవతా విలువలను చాటిచెప్పారని, ఆయన ఆశయాలు అందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.