హైదరాబాద్: 28°C
వార్తలు

1.3KM పొడవైన ట్రైన్.. 360 కంటైనర్లు

దేశంలో మొదటి 1.3 కి.మీ. పొడవైన డబుల్ స్టాక్ కంటైనర్ ట్రైన్ వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ షేర్ చేశారు. ఇది ముంబైలోని నెహ్రూ పోర్ట్ నుంచి వడోదరా (గుజరాత్)కు 422 KM ప్రయాణించిందని పేర్కొన్నారు. ఆ భారీ రైలు 3,922 టన్నుల బరువైన 360 కంటైనర్లను మోసుకెళ్లింది. ఒక్కో కంటైనర్ 20 అడుగుల పొడవు ఉంటుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.