హైదరాబాద్: 28°C
తెలంగాణ

గడ్డి చెరువు ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

BDK: టేకులపల్లి మండలం లచ్చగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని గడ్డి చెరువు ప్రాంగణాన్ని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆదివారం పరిశీలించారు. గడ్డి చెరువులో నీరు లేకపోవడంతో గ్రామంలోని రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గ్రామ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరారు.