హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత'

MNCL: మంచిర్యాల నగరపాలక సంస్థ పరిధి 11వ డివిజన్‌లోని తిరుమలగిరి కాలనీలో ఆదివారం వన మహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ పరిసరాల్లో వంద మొక్కలు నాటారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ సుదమల్ల హరికృష్ణ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని.. రాబోయే తరాలకు స్వచ్చమైన గాలి, పచ్చదనం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.