హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం

JN: జిల్లాలో జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు–2026కు అర్హత, ఆసక్తి ఉన్న ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో తెలిపారు. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు ఎంఈఓ ధ్రువీకరణతో, ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు హెచ్‌ఎం ధ్రువీకరణతో దరఖాస్తు చేయాలన్నారు. ఆగస్టు 25 సాయంత్రం 4 గంటల్లోగా జనగామ డీఈవో కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.