హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృద్ధుల ముసుగులో గంజాయి రవాణా

హైదరాబాద్‌లో వృద్ధ ప్రయాణికులపై అనుమానం తక్కువగా ఉంటుందనే విషయాన్ని ఆసరాగా చేసుకుని గంజాయి రవాణా చేస్తున్న ఐదుగురిని సీసీఎస్ క్రైమ్ టీమ్, గాంధీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 38 కిలోల డ్రై గంజాయి, సుమారు రూ.10 లక్షల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అరకు నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి గంజాయి తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.