ASF: బెజ్జూర్ మండలంలో ఆదివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షానికి వరి చేలల్లో నీరు నిలవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, వాగులు, వంకలు, లోలెవల్ వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు.
తెలంగాణ
VIDEO: బెజ్జూర్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం


