హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రవేశాలకు మరో ఛాన్స్.. సెప్టెంబర్ 9 వరకు గడువు

ASF: కాగజ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డా.BR అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో ప్రవేశాల గడువును సెప్టెంబర్ 9 వరకు పొడిగించినట్లు ప్రిన్సిపల్ శ్రీదేవి, కో-ఆర్డినేటర్ తూడూరు దత్తాత్రేయ తెలిపారు. ఇంటర్, తత్సమాన అర్హత ఉన్న విద్యార్థులు BA, BCOM, BSC కోర్సుల్లో ఆన్‌లైన్‌లో చేరవచ్చని, 2,3 సంవత్సరం విద్యార్థులు కూడా ట్యూషన్ ఫీజు చెల్లించాలని సూచించారు.