హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు బానిసై యువకుడి ఆత్మహత్య

KNR: జమ్మికుంట మండలం గండ్రపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటై క్రెడిట్ కార్డుల ద్వారా భారీగా అప్పులు చేసిన బీటెక్‌ పట్టభద్రుడు లింగంపల్లి ప్రదీప్‌కుమార్ శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులు తీర్చలేక, కుటుంబసభ్యులకు చెప్పుకోలేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.