హైదరాబాద్: 28°C
తెలంగాణ

జర్నలిస్ట్ రవీందర్‌పై దాడిని ఖండించిన ఎరుకల సంఘం

BHPL: జర్నలిస్ట్ పుల్ల రవీందర్‌పై జరిగిన దాడిని తెలంగాణ ప్రదేశ్ ఎరుకల సంఘం భూపాలపల్లి జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. దాడికి పాల్పడ్డ మధు వంశీ రావుపై హత్యాయత్నం, ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని జిల్లా అధ్యక్షుడు స్వామి డిమాండ్ చేశారు. రాజకీయ ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.