హైదరాబాద్: 28°C
తెలంగాణ

కౌలాస్ నాలా ప్రాజెక్టు నీటి వివరాలు

KMR: జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లు కాగా, ప్రస్తుతం 457.60 మీటర్లకు చేరిందని ఏఈ సుకుమార్‌రెడ్డి తెలిపారు. మరో 0.40 మీటర్ల నీరు చేరితే ప్రాజెక్టు నిండుతుందన్నారు. ఎగువన మహారాష్ట్రలోని ఏడూరు ప్రాజెక్టు నుంచి మిగులు జలాలు వస్తే పూర్తిగా నిండే అవకాశం ఉందన్నారు.