హైదరాబాద్: 28°C
తెలంగాణ

సన్న వడ్ల విత్తన వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: AO

BHPL: గోరికొత్తపల్లి మండలంలోని ప్రభుత్వం గుర్తించిన ఏడు సన్న వరి రకాలను సాగు చేస్తున్న రైతులు విత్తనాల వివరాలను తప్పనిసరిగా ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవాలని మండల వ్యవసాయ అధికారి (AO) సారయ్య సూచించారు. నమోదు చేయని రైతులకు ప్రభుత్వం అందించే రూ. 500 బోనస్ అందదన్నారు . అర్హత గల రైతులు ఈ నెల 31లోగా వివరాలను నమోదు చేసుకోవాలని కోరారు.