హైదరాబాద్: 28°C
తెలంగాణ

బెల్ట్ షాపుల ఎత్తివేత.. విక్రయిస్తే కఠిన చర్యలు.!

MDK: నిజాంపేట మండలం కల్వకుంట గ్రామంలో బెల్ట్ షాపులను పూర్తిగా మూసివేయాలని ఆదివారం గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో వెంకటాపూర్ (కె)కి చెందిన యువకుడు మృతి చెందడంతో ఇరు గ్రామాల ప్రజలు అత్యవసరంగా సమావేశమయ్యారు. విచ్చలవిడి మద్యం విక్రయాలతో యువత చెడుదారిన పడుతున్నందున బెల్ట్ షాపులను బంద్ చేయాలని నిర్ణయించారు.