హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: గర్భిణీ మృతిపై కుటుంబ సభ్యుల ఆందోళన

వరంగల్ కాశిబుగ్గలో గర్భిణీ మృతి కలకలం రేపింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే అస్త్రం లత (34) మృతి చెందిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు వెంకట్రామ థియేటర్ సమీపంలో రాస్తారోకో నిర్వహించారు. ప్రసవ ఆపరేషన్ అనంతరం ఫిట్స్ రావడంతో మరో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. లత మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.