NTR: మైలవరం నూజివీడు రోడ్డులోని ప్రసిద్ధ అమ్మవారి చెట్టు వద్ద శనివారం మహిళలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పసుపు, కుంకుమ సమర్పించి కొబ్బరికాయలు కొట్టారు. కుటుంబాల్లో సుఖశాంతులు, ఆరోగ్యం, సౌభాగ్యం కలగాలని ప్రార్థిస్తూ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
భక్తిశ్రద్ధలతో అమ్మవారి చెట్టుకు పూజలు


