హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మూడు రోజులపాటు నీటిసరఫరా బంద్

E.G: పైప్‌లైన్ మరమ్మతుల కారణంగా కొవ్వూరు పట్టణంలోని 14, 15 వార్డుల్లో మూడు రోజులపాటు నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ నెల 24, 25, 26 తేదీల్లో నీటి సరఫరా నిలిపివేస్తామని పురపాలక కమిషనర్ జి. సందీప్ తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని అందించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.