హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు సొసైటీ ఛైర్మన్‌ల ఎంపికపై సమావేశాలు

NZB: నామినేటెడ్ పద్ధతిలో సహకార సంఘాల పాలక వర్గాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఇవాళ అధికార కాంగ్రెస్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 6 నియోజక వర్గాల ముఖ్య నేతలతో నగరంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నారు.