హైదరాబాద్: 28°C
తెలంగాణ

మూలమలుపులో గుంతలు.. పొంచి ఉన్న ప్రమాదం

JN: జనగామ–హైదరాబాద్ బైపాస్ నుంచి పెంబర్తి మీదుగా మాణిక్యపురం వెళ్లే రహదారిలో మూలమలుపు వద్ద రోడ్డుపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్న నేపథ్యంలో అధికారులు స్పందించి గుంతలను వెంటనే పూడ్చాలని వాహనదారులు కోరుతున్నారు.