హైదరాబాద్: 28°C
తెలంగాణ

ములుగు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా లావుడ్య రమేశ్

ములుగు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా లావుడ్య రమేశ్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ నియామక పత్రాన్ని అందజేశారు. మంత్రి సీతక్క ఆదేశాల మేరకు జరిగిన నియామకంపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రమేశ్ తెలిపారు.