హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవం

VZM: ప్రపంచ జానపద కళాకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న బొబ్బిలి కళాభారతిలో సకల కళల ప్రదర్శన నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నకలును తలపించేలా తరలివచ్చిన కళాకారులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ వేడుకల్లో నీలబోను సత్యం తప్పెటగుళ్లు, అప్పారావు జాలారి నృత్య ప్రదర్శన, కోలాటం, చెక్క భజనలు వంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో అలరించాయి.