E.G: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టాలని CI కాశీ సూచించారు. రాజమండ్రి రూరల్ బొమ్మూరు పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గుడ్ టచ్-బ్యాడ్ టచ్, సైబర్ మోసాలు, సోషల్ మీడియా దుర్వినియోగంపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద కార్యకలాపాలు గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి: సీఐ


