హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లారీ-కారు ఢీ.. ఇద్దరికీ గాయాలు

ప్రకాశం: అద్దంకి(M) గోపాలపురం గ్రామ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొని కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్సులో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.