కోనసీమ: కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సీఎం చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని ఉప్పలగుప్తంకి చెందిన వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి సలాది సతీష్ శనివారం విమర్శించారు. కాపు కార్పొరేషన్‌కు నిధులు, లబ్ధిదారులపై ప్రభుత్వం చెబుతున్న వివరాలు వాస్తవాలకు దూరంగా ఉన్నాయని ఆరోపించారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పించేలా పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కాపులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది'


