హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బొమ్మూరు డైట్లో రెండో విడత కౌన్సెలింగ్

E.G: బొమ్మూరు డైట్లో డీసెట్-2026 రెండో విడత కౌన్సెలింగ్ శనివారం ప్రారంభమైనట్లు ప్రిన్సిపల్ ఆర్జేడీ రాజు తెలిపారు. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ 22 నుంచి 24 వరకు జరుగుతుందని ఆయన వివరించారు. తొలిరోజు 9 మంది ధ్రువపత్రాలు పరిశీలించి, ప్రవేశ పత్రాలు అందించామని వెల్లడించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే అభ్యర్థులు సమయానికి హాజరుకావాలని ఆయన సూచించారు.