హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రజా సమస్యలపై ఎంపీకి భారీగా ఫోన్లు

NTR: ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) నిర్వహించిన ‘డయల్ యువర్ ఎంపీ’ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చింది. గంటలోనే 45-50 మంది ఫోన్ చేసి సమస్యలను వివరించారు. కొన్ని అంశాలను వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ, మిగతా సమస్యల పరిష్కారానికి కార్యాలయానికి రావాలని సూచించారు. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు.