E.G: అత్యవసర మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు రాజమండ్రిలోని కోరుకొండ రోడ్డు, రామకృష్ణమఠం, సుభాష్‌నగర్, హరిపురం తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ నక్కపల్లి శామ్యూల్ తెలిపారు. గౌతమి కంటి ఆసుపత్రి, కృష్ణుడి గుడి, సుబ్రహ్మణ్యస్వామి గుడి, గణేష్‌నగర్, వీరభద్రపురం ప్రాంతాలకు కూడా అంతరాయం ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్


