హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెరిగిన నిమ్మ ధరలు

NLR: నిమ్మకాయల దిగుబడి గణనీయంగా తగ్గడంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పొదలకూరు నిమ్మ మార్కెట్ యార్డులో బస్తా నిమ్మకాయల ధర దాదాపుగా పదివేల రూపాయల వరకు పలుకుతోంది. కిలో ధర రూ. 60 నుంచి రూ. 125 వరకు ఉందని వ్యాపారస్థులు తెలిపారు. తోటల్లో దిగుబడి లేకపోవడంతో రైతులకు పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. కొద్దిపాటి కాయలు ఉన్న రైతులకు మాత్రం మంచి ధర లభిస్తోంది.