హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ELR: చింతలపూడి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్‌లో కోర్టు కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న పి. వెంకటేశ్వరరావు శనివారం గుండెపోటుతో మరణించారు. 2014 బ్యాచ్‌కు చెందిన వెంకటేశ్వరరావు విధుల్లో నిబద్ధత కలిగిన ఉద్యోగిగా మంచి పేరు తెచ్చుకున్నారు. శనివారం తన స్వగృహంలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మరణించారు.