హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దరఖాస్తుల పరిశీలనకు ప్రత్యేక బృందం

ASR: పాడేరు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు 385 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. దరఖాస్తుల స్వీకరణ ముగియగా, ఈ నెల 24న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో వీటి తుది పరిశీలన జరగనుంది. పరిశీలన అనంతరం అర్హుల తుది జాబితాను విడుదల చేయనున్నారు.