హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిమ్‌లో కుప్పకూలి ఎల్‌ఐసీ ఉద్యోగి మృతి

సత్యసాయి: కదిరి ఎల్‌ఐసీలో డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా పని చేస్తున్న షాజహాన్ (36) శనివారం రాత్రి జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకులారు. రాత్రి 8.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. జిమ్ సిబ్బంది వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం షాజహాన్‌ను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు