WG: భీమవరం కలెక్టరేట్‌లో కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన శనివారం గర్భస్థ పిండ లింగ నిర్ధారణ కమిటీ సమావేశం జరిగింది. చట్టవిరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే పీసీపీఎన్డీటీ చట్టం–1994 ప్రకారం స్కానింగ్ కేంద్రాల నిర్వాహకులపై కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను తరచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
లింగ నిర్ధారణ పరీక్షలపై కలెక్టర్ హెచ్చరిక


