NZB: బీజేపీ మండల సంస్థాగత నియామకాల ప్రక్రియలో భాగంగా డిచ్‌పల్లి మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడిగా ఈగ గంగారెడ్డిని నియమించారు. బీజేపీ మండల అధ్యక్షుడు కర్నీ చంద్రకాంత్ శనివారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గంగారెడ్డి మాట్లాడుతూ.. మండలంలోని రైతుల సమస్యలపై పోరాటాలకు ప్రణాళికలు రూపొందించి, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని తెలిపారు.
తెలంగాణ
కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడిగా ఈగ గంగారెడ్డి


