హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

AKP: పాయకరావుపేటలో ఆదివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రామకృష్ణ తెలిపారు. రహదారి విస్తరణ పనులు కారణంగా ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పట్టణ పరిధిలో గుంటపల్లి కాలనీ, ఇందిరా కాలనీ, ఆనంద్ నగర్, పండరీపురం, కురుమళ్ల కాలనీతో పాటు నామవరం,పీఎల్ పురం గ్రామాలకు విద్యుత్తు సరఫరా ఉండదన్నారు.