హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ

అనంతపురం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉన్నతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో బెంగళూరులో టాలీ, కంప్యూటర్ కోర్సులలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అడ్మిషన్ల కోఆర్డినేటర్ హరిప్రసాద్ తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ 35 రోజుల శిక్షణా కాలంలో అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి కల్పిస్తారు. పూర్తి వివరాలకు 9000487423 నంబర్‌లో సంప్రదించవచ్చు.