హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మారుమూల గ్రామంలో వైద్య శిబిరం

ELR: బుట్టాయగూడెం మండలం జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుట్టాయగూడెం మండలం మారుమూల గ్రామమైన ముంజులూరులో ఆదివారం వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహక కమిటీ ప్రతినిధులు తెలిపారు. జంగారెడ్డిగూడెం నిర్మలా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య నిపుణులు సేవలు అందిస్తారని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.