ప్రకాశం: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని పలువురికి గాయాలైన సంఘటన కనిగిరి(M)నందనం మారెళ్ళ గ్రామ సమీపంలో గడ్డమీద పల్లి హైవే వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. వంట పనికి వెళ్తున్న బోదేపల్లి బాలయ్య కిరణ్‌లను పల్సర్ బండి పై వెళ్తున్న గార్ల పేట గ్రామానికి చెందిన కార్తీక్ ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. గాయాల పాలైన వ్యక్తులను కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
రెండు బైకులు ఢీ.. పలువురికి గాయాలు


