హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కృష్ణా: విద్యుత్ తీగల మరమ్మతుల కారణంగా గన్నవరం సెక్షన్ పరిధిలో పలుచోట్ల ఆదివారం సరఫరాకు అంతరాయం ఏర్పడనున్నట్లు EE విశ్వేశ్వర ప్రసాద్ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. వీరపనేనిగూడెం, తెంపల్లి, బల్లిపర్రు, మర్లపాలెం కాలనీ, మెట్లపల్లి, కొత్తగూడెం, చింతగుంట, కండ్రిక, చిక్కవరం తదితర ప్రాంతాలలో ఉండదన్నారు.