తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, ధైర్యసాహసాలకు ప్రతిరూపం చాకలి ఐలమ్మ(చిట్యాల ఐలమ్మ). నిజాం పాలనలో దొరల అరాచకాలను, వెట్టిచాకిరిని ఎదిరించిన తొలి మహిళ. పాలకుర్తిలో కౌలు భూమి కోసం, పేదల విముక్తి కోసం రజాకార్లు, దేశ్‌ముఖ్‌ల దౌర్జన్యాలను ఆమె తిప్పికొట్టారు. కష్టాలను ఎదురుకుంటూ మొక్కవోని దీక్షతో ఆమె సాగించిన పోరాటం మహిళా లోకానికి, తరతరాలకూ ఎప్పటికీ గొప్ప స్ఫూర్తిదాయకం.
వార్తలు
INSPIRATION: చాకలి ఐలమ్మ


