హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు ఆలూరుకు ఇద్దరు మంత్రుల రాక

KRNL: రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు, బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత రేపు(సోమవారం) ఆలూరులో పర్యటించనున్నారు. స్థానికంగా జరిగే పలు కార్యక్రమాలు, సమావేశాల్లో మంత్రులు పాల్గొంటారు. అటు, మంత్రి నిమ్మల 25న ఉదయం మంత్రాలయం చేరుకుని స్థానిక పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఇద్దరు మంత్రుల పర్యటన నేపథ్యంలో అధికారులు తగు ఏర్పాట్లు చేశారు.