KNL: జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు క్రాంతి నాయుడుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం సరికాదని ఏపీ వాల్మీకి బోయ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎల్లార్తి అర్జున్ అన్నారు. కొందరి చెప్పుడు మాటలు విని, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న క్రాంతి నాయుడుపై అక్కసుతోనే కేసు పెట్టారని శనివారం ఆరోపించారు. ఈ కేసును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
క్రాంతి నాయుడుపై కేసు సరికాదు: ఎల్లార్తి అర్జున్


