హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

TG: రామగుండం(RFCL) ప్లాంట్ ఆగస్టు 22 నుంచి షట్‌డౌన్‌కు గురికావడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఖరీఫ్‌లో యూరియా డిమాండ్ ఎక్కువగా ఉన్నందున, సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్రమంత్రి జేపీ నడ్డాకు ఆయన లేఖ రాశారు. ఉత్పత్తిని పునరుద్ధరించాలని, లోటును ఇతర కర్మాగారాలు లేదా దిగుమతుల ద్వారా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.