హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డ్రైనేజ్ సమస్యను తక్షణమే పరిష్కరించాలి'

NDL: డోన్ పట్టణంలోని త్రివర్ణ కాలనీలో నెలకొన్న డ్రైనేజ్ సమస్యను శనివారం ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానికులను సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే డ్రైనేజ్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యమని ఎమ్మెల్యే తెలిపారు.