హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు జిల్లాకు కేంద్ర మంత్రి

VSP: గీతం డీమ్డ్ యూనివర్సిటీ వైద్య కళాశాల, ఆసుపత్రి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించనున్న 17వ స్నాతకోత్సవానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి. గుణశేఖరన్ తెలిపారు. ఎంపీ, గీతం అధ్యక్షుడు ఎం. శ్రీభరత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.