TG: రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మలచాలని ప్రపంచ వ్యాపార వర్గాలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. HYDలో జరిగిన గ్లోబల్ బిజినెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతులు, పారదర్శక పాలనతో రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా నిలపడమే లక్ష్యమని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో TG 10.7 శాతం వృద్ధి రేటు సాధించిందని తెలిపారు.
వార్తలు
రాష్ట్రాన్ని పెట్టుబడుల కేంద్రంగా మలచాలి: ఉత్తమ్


