హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు

KDP: పి.పి.కుంట చెక్‌పోస్ట్‌ సమీపంలో శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కంపసముద్రం, సింగనపల్లి సచివాలయాల్లో విధులు ముగించుకుని బద్వేలుకు వస్తున్న ఇద్దరు సిబ్బంది ప్రయాణిస్తున్న బైక్‌ను కారు ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లో బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.