బీహార్ బెట్టియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఒక బాలుడి పుట్టినరోజు సందర్భంగా నిర్వహించిన ఆర్కెస్ట్రా ప్రదర్శన వద్ద డ్యాన్స్ చేస్తున్న గుంపుపైకి బస్సు దూసుకెళ్లింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు. వీరిలో బాలుడు తండ్రి దేవేంద్ర కూడా ఉన్నారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి


