హైదరాబాద్: 28°C
వార్తలు

టీచర్లకు బెదిరింపు.. అభిజీత్ దీప్కేపై కేసు

CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై కేసు నమోదైంది. మహారాష్ట్ర లాతూర్ జిల్లాలో దీప్కేతో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ప్రభుత్వ పాఠశాలలోకి ప్రవేశించడం, తరగతులకు అంతరాయం కలిగించడం, ఉపాధ్యాయుల్ని బెదిరించారంటూ ఉపాధ్యాయురాలు సయ్యద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో BNS సెక్షన్లు 132, 329(3), 351(2), 356(2) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.